జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
విద్యార్థుల్లో సాంకేతికంగా మేథో శక్తిని, శృజనాత్మకతను పెంపోందిచడానికి సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.
మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను ఆసక్తిగా తిలకించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తూ భవిష్యత్ శాస్త్రవేతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నేడు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ గురుకుల పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాలయాలకు ఎంపిక అవుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల జాయింట్ సెక్రెటరీ సక్రు నాయక్, వరంగల్ రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి, ఖమ్మం రీజినల్ కోఆర్డినేటర్ నిర్మల, హన్మకొండ డీసీఓ ఉమ మహేశ్వరి, అసిస్టెంట్ రీజినల్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ, కార్పొరేటర్ రాధికా రెడ్డి, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ దువ్వ నవీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి