ఘనంగా దీక్షా దివాస్....
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు దిక్షా దివాస్ అని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.
కేసీఆర్ దిక్షా దివాస్ సందర్బంగా వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి సీఎం కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్షంగా ఉద్యమించి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్షచేపట్టిన నవంబర్ 29ని దీక్షాదివస్‌గా ప్రతియేటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో కెసిఆర్ ఆమరణ దీక్ష చరిత్రాత్మకంగా చిరస్థాయిగా నిలిచి పోతుందని అన్నారు. నవంబర్ 29ని దీక్షాదివస్‌గా జరుపుకుని బంగారు తెలంగాణ సాధించే లక్ష్యానికి అందరం పునరంకితం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి