కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి....
గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారంలో నిర్వహిస్తున్న కాకతీయ కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ యువతను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటానని అన్నారు. ఇప్పటికే అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా పోటీ పరీక్షలకు 100రోజుల పాటు ఉచిత ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే వచ్చే నెల 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే త్వరలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు అనేక మంది క్రీడాకారులకు ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. విద్యా, క్రీడా రంగాలలో రాణించే యువతకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా నేతాజీ యూత్ అసోసియేషన్ భవన నిర్మాణానికి 10లక్షల రూపాయలు అలాగే 5లక్షల రూపాయలతో మ్యాట్ లను ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా, జోనల్, మండలాల చైర్మన్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి