భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అరూరి...

 







భారత రాజ్యాంగ పరిరక్షణ.. మన అందరి బాధ్యత అనీ, అందుకు ప్రతి భారతీయుడు తన వంతు కషి చేయాలని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పేర్కొన్నారు.


 73 వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హన్మకొండ అంబేద్కర్ సర్కిల్ లోని భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు భారతీయ పౌరులుగా కృషి చేయడం మన బాధ్యత అని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివద్ధి, అభ్యున్నతిని కాంక్షించి 26 నవంబర్‌ 1949న జాతికి అంకితం చేసి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్న విషయాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్యాగం, కృషి, పట్టుదల, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణ, అకుంఠిత దీక్షా దక్షతలకు రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ గారు నిలువెత్తు నిదర్శనం అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశ చరిత్రలోనే మొదటి సారిగా దళితుల ఆర్థిక, సామజిక అభివృద్ధికి దళిత బందు పథకం ద్వారా 10లక్షల రూపాయలు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని వెల్లడించారు.


ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు