తెరాస గూటికి బిజెపి యువ నేత కందుకూరి సాయి చందు






గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ కు చెందిన బిజెపి  యువ మోర్చ జిల్లా కార్యదర్శి కందుకూరి సాయి చందు మరియు SELFIE FASION's అధినేత పావుశెట్టి వినయ్ ఈ రోజు 66వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, వర్ధన్నపేట శాసనసభ్యులు గౌ||శ్రీ అరూరి రమేష్ గారి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరడం జరిగింది.వారికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించడం జరిగింది.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ||శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సంక్షేమ పథకాలకు ఆకర్శితులై యువత ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. పార్టీలో చేరిన వారిలో గుండ మీది విజయమోహన్, గౌరీశెట్టి శ్రీనివాస్, మొట్టె గణేష్, సూర్య, తదితరులు బిజెపి నుండి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు