పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా.... ముఖ్యమంత్రి సహాయ నిధి: ఆరూరి రమేష్
వర్దన్నపేట మండలం దివిటిపల్లి గ్రామానికి చెందిన ఎల్లగౌడ్ గారి భార్య శ్రీలత గారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే గారి దృషికి రావడంతో వారికీ ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా 2లక్షల రూపాయల LOCని హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి