బాలాజీ గార్డెన్స్ లో ముగిసిన తెరాసా కార్యకర్తల సమావేశం




  నిన్న గౌ||వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు, వరంగల్ జిల్లా తెరాస అధ్యక్షులు శ్రీ ఆరురి రమేష్ గారి సూచన మేరకు గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ తెరాస అదక్షుడు శ్రీ పాపిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో  కార్యకర్తలనుద్దేశించి  ఉదయం 10 గంటలకు ఏర్రగట్టు గుట్ట బాలాజీ గార్డెన్స్ లో డివిజన్ స్థాయి కార్యకర్తల సమావేశం  జరిగింది... ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా   ఎన్నికల డివిజన్ ఇంఛార్జి గట్టు రాజు గారు హాజరు అయ్యారు..ఆత్మ చైర్మన్ &తెరాసా సీనియర్ నాయకులు కందుకూరి చంద్రమోహన్ , ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ చకిలం రాజేశ్వ ర్ రావు, ఆత్మకూరు మార్కెటింగ్ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి ,తెరాసా సీనియర్ నాయకులు పిట్టల కుమారస్వామి,పిట్టల సదానందం, వ ల్లాలా యాదగిరి,గూడూరు తిరుపతి, 66 వ డివిజన్ యూత్ అధ్యక్షులు వల్లా ల శ్రీకాంత్ గౌడ్, కందుకూరి సాయి చందు మరియు   మహిళా విభాగం, యువజన విభాగం, సోషల్ మీడియా వారియర్స్, నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల నాయకులు హాజరు అయ్యారు.ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ఉన్న అభివృద్ది,సంక్షేమ పథకాల అమలు గురించి,సమస్యల పరిష్కారం కోసం  మరియు కార్యకర్త కుటుంబానికి చేయూత అంశాల గురించి పలువురు నాయకులు కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ 100 మంది ఓ టర్ లకు ఒకరు ఇంచార్జీ గా నియమించాలని కోరుతూ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ గారు వార్డు ల వారీ గా ఇంచార్జీ ల పేర్లు ప్రకటించారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు